Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమౌళి పేరుతో మోసం... ఆర్ఆర్ఆర్ సినిమాలో చాన్స్ అంటూ నకిలీ ప్రకటనలు!

  • రాజమౌళి పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు
  • ఆర్ఆర్ఆర్ కు కాస్టింగ్ కాల్స్ అంటూ ప్రకటనలు
  • నమ్మవద్దంటున్న డీవీవీ ఎంటర్టయిన్ మెంట్స్ సంస్థ
తెలుగులో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో అవకాశాలు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు మోసాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దర్శకుడు రాజమౌళి పేరు చెప్పి, ఆర్ఆర్ఆర్ సినిమాకు కాస్టింగ్ కాల్స్ అంటూ నకిలీ ప్రకటనలు ఇస్తున్నారని చిత్రబృందం వెల్లడించింది. రాజమౌళి పేరుతో సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచి, ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం నటీనటులు కావాలని వాటి ద్వారా మోసపూరిత ప్రచారం చేస్తున్నారని డీవీవీ ఎంటర్టయిన్ మెంట్స్ సంస్థ వివరించింది. ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఎలాంటి సమాచారాన్నయినా తాము నేరుగా తమ అధికారిక సోషల్ మీడియా చానల్ ద్వారానే వెల్లడిస్తామని, మోసపూరిత ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని డీవీవీ స్పష్టం చేసింది.
DVV
RRR
Rajamouli

More Telugu News